పార్లమెంటులో అంబేడ్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆలూరు అంబేడ్కర్ కూడలిలో కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మార్గదర్శిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ కోరాలన్నారు.