సంక్రాంతి సందర్భంగా ఆస్పరి జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ, మహేష్, అరవింద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ20, 116లు, ద్వితీయ బహుమతి రూ. 10, 116లు, తృతీయ బహుమతిగా రూ. 5, 016లు ఇస్తామన్నారు. మరిన్ని వివారలకు 9010788451 నంబర్ లో సంప్రదించాలని తెలిపారు.