ఆలూరు మండలం పెద్దహోతూరుకు చెందిన టీడీపీ నాయకుడు, కాంట్రాక్టర్ భీమప్ప చౌదరి (72) ఆదివారం మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పనిచేశారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో బంధువులు బళ్లారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీమప్ప చౌదరికి భార్య ధనలక్ష్మి, కుమార్తెలు సమీర, సయుక్త ఉన్నారు. ఆయన మృతి పట్ల ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ సంతాపం తెలిపారు.