విద్యార్థులకు ఆటోమోటివ్స్ పై అవగాహన

52చూసినవారు
విద్యార్థులకు ఆటోమోటివ్స్ పై అవగాహన
చిప్పగిరి మండల పరిధిలోని నేమకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఆటో మోటార్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఒకేషనల్ విద్యా ఇన్స్ట్రక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి ఆటోమోటివ్ ఇంజన్. దాని పనితనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతివారం విద్యార్థులకు ఏదో ఒక టాపిక్ పై ఫీల్డ్ ట్రిప్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్