నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు టిడిపి నాయకులు గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు.