తెగిపోయిన బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి

75చూసినవారు
హాలహర్వి మండలం చింతకుంట గ్రామ శివారులో తెగిపోయిన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. శుక్రవారం తెగిపోయిన బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిశీలించి, మాట్లాడారు. బ్రిడ్జి తెగిపోవడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయని, సుమారు వేలాది ఎకరాలకు వెళ్ళేందుకు దారి లేకుండా మారిందన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో ఫోన్ లో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్