హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ సినీనటులు నందమూరి బాలకృష్ణ ఈనెల 14న బనగానపల్లెలో పర్యటించనున్నారు. సైకిల్ రావాలి యాత్ర పేరుతో అనంతపురం జిల్లాలో మొదలైన బాలకృష్ణ పర్యటన తాడిపత్రి నుండి 14వ తేదీన బనగానపల్లెకు చేరుకొని, రాత్రి ఇక్కడే బస చేయనున్నట్లు టిడిపి వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం 15న ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారని వెల్లడించారు.