విఓఎల ఉపాధిని దెబ్బతీసే 3సంవత్సరాల కాలపరిమితి సర్యూలర్ రద్దు చేయాలని అవుకు మండల వెలుగు వివోఏ ల అధ్యక్షులు టి.చంద్ర అన్నారు. సోమవారం మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఏపీఎం చంద్రశేఖర్ కి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి సర్క్యూలర్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు. విఓఎల ఉపాధిని కాపాడాలని, అక్రమ తొలగింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు.