బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు రిజర్వాయర్ నుంచి శనివారం నీటి విడుదల కొనసాగుతోంది. కడప, చిత్తూరు జిల్లాలకు సంబంధించి అవుకు రిజర్వాయర్ జీఎన్ఎస్ఎస్ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెలరోజుల నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కడపకు 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.