రాష్ట్రంలో హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సోమవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నా బనగానపల్లెలో అభివృద్ధి చేయలేకపోతున్నారని విమర్శించారు.