సంజామలలో ఎడతెరిపిలేని వర్షం

66చూసినవారు
బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం చిన్నపాటి ఉరుములు, మెరుపులతో దాదాపు గంటన్నర పాటు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజుల క్రితం పోలింగ్ రోజున కూడా ఇదే తరహాలో వర్షం కురిసింది. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు ప్రకృతిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్