కోసిగిలో నిలిచిపోయిన జార్ఖండ్ రైలు

81చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి సమీపంలో వాస్కో నుంచి జాసిద్ధి వెళ్లాల్సిన జార్ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. శుక్రవారం కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే ఏసీ బోగి కింద పొగ చెలరేగడంతో 40 నిమిషాల పాటు ఆకస్మికంగా నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాయచూర్ స్టేషన్ అధికారులను సంప్రదించి, మరమ్మతులు చేయించామన్నారు. డబుల్ లైన్ కావడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడలేదు.

సంబంధిత పోస్ట్