సంజామల మండలంలోని రామిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ సోమ సుందర్ రెడ్డి అనారోగ్య కారణంతో రెండు నెలలు సెలవు పెట్టడంతో ఉప సర్పంచ్ గా ఉన్న వీరప్రతాప్ రెడ్డి సర్పంచ్ గా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీరప్రతాపరెడ్డి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రజలందరూ, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.