గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారము నంద్యాల నగరంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రమును ప్యాపిలి ఆర్ ఐ సుధాకర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలీ తాసిల్దార్ బి. భారతి ఆధ్వరంలో తమ తోటి సిబ్బంది తో ఆర్ఐ వి. సుధాకర్ రెడ్డికి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి హర్షం వ్యక్తం చేశారు.