ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఐదవ తరగతి తర్వాత చదువు మానేసిన డోన్ మండలం వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన బోయ స్వప్న అనే పేద విద్యార్థినికి దాతలు చేయూతనందించారు. విషయం తెలుసుకున్న డోన్ మండలం మల్యాల నివాసి ప్రస్తుతం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న సురేష్ వాసవి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పదవతరగతి వరకు ఆ విద్యార్థినికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని ఒప్పించారు.