ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో బోగి సందర్బంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సెంటర్ ఆప్ సీఐటీయూ, ప్రజా నాట్యమండలి సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పొటీలు నిర్వహిస్తున్నామని ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు, సీఐటీయూ మండల సహాయ కార్యదర్శి శ్రీనివాస్ లు తెలిపారు. ప్రతి సంవత్సరం మండలంలోని ఒక గ్రామంలో నిర్వహిస్తూనే ఉంటామని ఈసారి జలదుర్గంలో నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ మహిళలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.