వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై హనుమంతయ్య

69చూసినవారు
వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై హనుమంతయ్య
గూడూరు మండలం మునగాల గ్రామంలో ఎస్సై హనుమంతయ్య ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రవాహానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, అలాగే విద్యుత్ లైన్ లకు ఎక్కడైనా చెట్లకొమ్మలు తగిలితే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్