చిత్తూరు: జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు జస్వంత్ రెడ్డి ఎంపిక

56చూసినవారు
చిత్తూరు: జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ జట్టుకు జస్వంత్ రెడ్డి ఎంపిక
చిత్తూరు డిఎస్ఏ ఔట్ డోర్ స్టేడియం శిక్షణ శిబిరం నందు 39వ యూత్ బాస్కెట్ బాల్ జాతీయస్థాయి ఆంధ్రప్రదేశ్ జట్టుకు కర్నూలు క్రీడాకారుడు జస్వంత్ రెడ్డి ఎంపికైనట్లు రాష్ట్ర బాస్కెట్ బాల్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి తెలిపారు. కర్నూలు జిల్లా బాస్కెట్ బాల్ సంఘం ప్రతినిధి దాదాభాషా మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారుడు జస్వంత్ రెడ్డి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా నగరంలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 దాకా జరగబోయే 39వ బాస్కెట్ బాల్ యూత్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్