బీజేపీ ప్రభుత్వంతో కార్మిక చట్టాల నిర్వీర్యం

84చూసినవారు
బీజేపీ ప్రభుత్వంతో కార్మిక చట్టాల నిర్వీర్యం
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని, ఫలితంగా కార్మికులు రోడ్డున పడుతున్నారని కర్నూలు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి. గౌస్ దేశాయ్ విమర్శించారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు రాజశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్