కౌతాళం మండలం రైతులు ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి వలన నష్టపోతున్నారని, వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలై ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని, అందుకు తుంగభద్ర నదిపై చీకలపర్వీ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ పండిన పంటకు గిట్టుబాటు రాక రైతులు నష్టపోతున్నారన్నారు.