కోసిగి మండలం అర్లబండ గ్రామం వెలిసిన శ్రీ శాంభవి దేవి రథోత్సవ జాతరలో ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు. శ్రీ వెంకమాంబ కృషవధూత పీఠాధిపతులు పిలుపు మేరకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. మండల నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, చుడి చిన్న సిద్ధప్ప, తదితరులు పాల్గొన్నారు.