దుబాయ్ వేదికగా జరుగుతున్న 24 హెచ్ కారు రేసింగ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. అజిత్ కుమార్, ఆయన టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. గొప్ప సంకల్పంతో అంతర్జాతీయ వేదికపై విజయాన్ని సొంతం చేసుకుని భారత జాతీయ జెండాను ఎగుర వేయడం నిజంగా స్ఫూర్తిదాయకం అన్నారు. ‘మీరు, మీ జట్టు మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.