జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ను ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ బుధవారం తనిఖీ చేశారు. ఆయన స్టేషన్ గదులను, స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డును పరిశీలించి ఎస్సై లక్ష్మీనారాయణతో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు పనిచేస్తున్నట్లు జూపాడుబంగ్లా పరిధిలో పెండింగ్ కేసు లేకుండా చేధిస్తున్నట్లు తెలిపారు.