నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో గణేష్ చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై సురేష్ బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన పాములపాడులో గల స్థానిక పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.