నందికొట్కూరు నియోజకవర్గం లోని ఆరు మండలాలలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా నాయకుడు పిక్కిలి వెంకటేశ్వర్లు శుక్రవారం నందికొట్కూరులో తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కౌలు చట్టం రద్దు చేసి 2011 రైతు చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.