పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ఉపాధి హామీ పథకం నిధుల కింద పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లులో రూ. 2 కోట్లతో పనులకు సోమవారం భూమిపూజ చేయనున్నట్లు ఆదివారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.