పాణ్యం: ఆలయ భూములను తవ్వేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

67చూసినవారు
ఓర్వకల్లు మండలం శకునాలలో రెవెన్యూ గ్రామసభలో సిపిఎం శాఖ కార్యదర్శి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో డీటీ తహసీల్దార్ షర్మిలా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం వారు మాట్లాడారు. శకునాలలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా భూములను సోలార్ పరిశ్రమ కోసం త్యాగం చేశారని, వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాశీరామేశ్వర స్వామి ఆలయ భూములు అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్