పత్తికొండ: భూ సర్వేకు రైతులు సహకరించాలి

53చూసినవారు
పత్తికొండ: భూ సర్వేకు రైతులు సహకరించాలి
మద్దికెర మండలంలో భూ సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని తహసీల్దార్ హుసేన్ సాహెబ్, సర్పంచ్ మల్లికార్జున కోరారు. శుక్రవారం మండలంలోని పెరవలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూ సర్వేపై వారు మాట్లాడారు. భూసర్వేతో భవిష్యత్ లో అన్నదాతలకు భూసమస్యలు ఉండవన్నారు. భూ కొలతలు ప్రకారం రికార్డుల్లో నమోదు చేస్తామని చెప్పారు. వీఆర్వోలు బాలవర్ధిరాజు, ఈఓ సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్