పత్తికొండలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి కోరారు. వారు గురువారం న్యాయవాదులతో కలిసి అమరావతిలో న్యాయశాఖ కార్యదర్శి వి. సునీతకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో వెనుకబడిన పత్తికొండ పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లేకపోవడంతో న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు ఆదోనికి వెళ్లాల్సి వస్తోందని, ఇబ్బందులను వివరించారు.