విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఆత్మకూరు ఆర్డీవో మిరియాల దాస్ కు గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ సేవా పురస్కారం లభించింది. జిల్లా కేంద్రమైన నంద్యాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయనకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.