రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ దక్షిణ మాడవీధిలో వేద పాఠశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాలు అందరిని ఆకట్టుకున్నాయి. కాగా ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో యోగా ఆసనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.