శ్రీశైలం మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు జరుగనున్నాయి. 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు, మరియు వైదికకమిటీతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.