1వ తేదీ ఐచ్ఛిక సెలవురోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా జనవరి 1న శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేయబడింది. ఆ రోజున భక్తులందరికీ కూడా కేవలం శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేయబడ్డాయన్నారు.