వినుకొండ: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విధి వక్రించిన అభాగ్యులు ఎందరికో ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంలా ఆదుకుంటోందని శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ. 7. 37 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.