వేధిస్తున్నాడంటూ మహిళ ఫిర్యాదు

84చూసినవారు
వినుకొండ పట్టణానికి చెందిన ఓ మహిళ తనకు న్యాయం చేయాలని శనివారం వినుకొండ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన నాగూర్ వలి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని వాపోయింది. తనను నగ్నంగా వీడియో తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

సంబంధిత పోస్ట్