ఎమ్మిగనూరు మండలం కే.తిమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ సిపిఐ నాయకులు కామ్రేడ్ బిజీ మాదన్న 7వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కే.తిమ్మాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాదన్న స్థూపానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య నివాళి అర్పించి మాట్లాడారు. సిపిఐ బలోపేతానికి కామ్రేడ్ మాదన్న ఎనలేని కృషి చేశారన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నో ఉద్యమాలు నడిపారని అన్నారు.