అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా శుక్రవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. శాసనసభ చరిత్రలో ఈ కమిటీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు మేరకు వివిధ శాఖలు చేసే నిధుల వ్యయాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది. కమిటీలో శాసనసభ నుంచి 9 మంది, శాసన మండలి నుంచి ముగ్గురు చొప్పున 12 మంది సభ్యులు ఉంటారు.