కర్నూలు జిల్లా బనవాసి కళాశాలలో చదివే విద్యార్థినులను లైంగికంగా వేధించిన మద్దిలేటి, నారాయణస్వామి, రమణ, శ్రీధర్ పై తక్షణమే కేసులు నమోదు చేయాలని ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో సీఎస్ విజయానంద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మహిళా అధ్యాపకులను నియమించాలన్నారు. సీఎస్ విజయానంద్ స్పందిస్తూ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.