హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రధాన కాలువ విస్తరణ పనులు తక్షణమే చేపట్టాలని, పశ్చిమ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం పెంచే పనులకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరిత, బీవీ జయ నాగేశ్వరరెడ్డి, బొగ్గుల దస్తగిరి, డాక్టర్ పార్థసారథి గురువారం సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని సీఎం ఛాంబరులో కలసి వినతిపత్రం అందజేశారు.