గత వైసీపీ ప్రభుత్వం చేనేత కళాకారులకు బీవీ మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాల్లో పేదలు నిర్మించిన గుడిసెలను కక్ష్య సాధింపుగా బుల్డోజర్ తో కూల్చివేసిందని విమర్శించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి బుధవారం మాట్లాడారు. చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఉగాది లోపు చేనేతలకు టిట్కో గృహాలు అందించి, అక్కడే చేనేత శాలలు ఏర్పాటు చేస్తామని మునుముందు ప్రకటించారు.