ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి పెన్షన్ దారులు గురువారం తమతమ ఇళ్ల దగ్గర అందుబాటులో ఉండాలని మునిసిపల్ కమిషినర్ ఎన్. గంగిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ పట్టణం మొత్తం 9763 పెన్షన్లు దారాలు ఉన్నారని ఉదయం 6 గంటల నుండి సచివాలయం ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ జరుగుతుందని అన్నారు. కావున లబ్ధిదారులందరూ రేపు ఉదయం అందుబాటులో ఉండాలని కోరారు.