చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. అందులోభాగంగా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది. గురువారం కొండాపూర్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కుతుబ్‌శాయి పేట గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. చెరువులో నాలుగంతస్తుల భవన నిర్మాణంపై చర్యలు చేపట్టారు.