కందుకూరు: ప్రతిరైతు పొలానికి నీరందించే బాధ్యతనాది: ఎమ్మెల్యే

81చూసినవారు
కందుకూరు: ప్రతిరైతు పొలానికి నీరందించే బాధ్యతనాది:  ఎమ్మెల్యే
లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో శుక్రవారం కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులో ప్రస్తుతం 17 అడుగుల నీరు ఉందని, ఆయకట్టు కింద ఉన్న రైతులు నారుమళ్లకు నీరు విడుదల చేయుటకు అధికారులతో చర్చించి తేదీ నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సీజన్లో రాళ్లపాడు ప్రాజెక్టు కింద ప్రతి రైతు పొలానికి నీరు అందించే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్