కందుకూరు పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును, కందుకూరు పట్టణానికి చెందిన ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్స్ మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు పట్టణంలో భద్రత దృష్ట్యా నూతనంగా ఏర్పాటు చేస్తున్న సి. సి కెమెరాలు ఏర్పాటు కొరకు 3.80 లక్షల రూపాయలను ఎమ్మెల్యేకు డాక్టర్లు తమ వంతు సహాయంగా అందజేశారు.