కందుకూరు: దాడికి పాల్పడిన వారిని వదలం

82చూసినవారు
కందుకూరు: దాడికి పాల్పడిన వారిని వదలం
జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న మహిళ ఆర్టీసీ ఉద్యోగి సుభాషిణి యాదవ్ పై ఓ వ్యక్తి తీవ్రంగా దాడి చేసిన విషయం విదితమే. ఆ మహిళను మంగళవారం కందుకూరులో ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు పలువురు సభ్యులతో కలిశారు. మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వదలమని, తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్