విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం కలిసారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) కమిటీ ఓటింగ్ అనంతరం నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ఇంటూరి కలిశారు. జిల్లా విభజనలో భాగంగా కందుకూరుని నెల్లూరు జిల్లాలో కలిపారని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని కోరారు. అలాగే కందుకూరు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.