కందుకూరు శివారులో ఉన్న సుందరయ్య నగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ కాలనీవాసులు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అనూషకు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గతంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం అక్కడ నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయించారని సమీపంలో పట్టాలు ఇచ్చారని అదే ప్రస్తుత సుందరయ్య నగర్ గా ఏర్పడిందని చెప్పారు. మంచినీటి పైప్ లైన్ లేదని ఏర్పాటు చేయాలని కోరారు.