ఉలవపాడు: భూ సమస్యలపై 62 అర్జీలు

51చూసినవారు
ఉలవపాడు: భూ సమస్యలపై 62 అర్జీలు
ఉలవపాడు మండలం మన్నెటి కోట గ్రామంలో తహశీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల భూ సమస్యలపై గ్రామస్తులు 62 అర్జీలను అధికారులకు అందజేశారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ సమస్యలపై ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రీ సర్వేను ప్రవేశపెట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్