బోగోలు చెరువు ఆయకట్టు దారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ని కలిశారు. ఈ సందర్భంగా బోగోలు చెరువు నీటి వినియోగదారుల ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని బోగోలు తహసీల్దార్ కి గతంలో ఫిర్యాదు చేశామని, కానీ ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని వాపోయారు. బోగోలు చెరువు ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకొని జాబితాని పబ్లిష్ చేయాలని, ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.