దగదర్తి మండల పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీవ్రమవుతాయని దగదర్తి ఎస్ఐ జంపాని కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పేకాట, కోడి పందాలు ఆడిన బెల్ట్ షాపులు నిర్వహించిన సమాచారాన్ని ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హెచ్చరికలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.